![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-698 లో.... రౌడీ మాట్లాడిన వీడియోని జ్యోత్స్నకి సూరజ్ చూపిస్తాడు. ఇప్పుడు నా గురించి నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్తే ఈ వీడియో అందరికి చూపిస్తానని సూరజ్ అనగానే జ్యోత్స్న భయపడుతుంది. మీ తాత గారు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు అన్నప్పుడు.... కొంచెం పొగరు బలుపు తిక్క ఉన్న అమ్మాయి కావాలని చెప్దామనుకున్న ఒక్క మాటలో చెప్పాలంటే నీలా అని సూరజ్ అనగానే జ్యోత్స్న కోప్పడుతుంది.
ఏంటి శివన్నారాయణ మనవరాలికి పెళ్లి కాదా అని సూరజ్ అంటాడు. ఇంకా నా ఒరిజినలిటీ తెలియదురా తెలిస్తే ఇలా ఉండవని జ్యోత్స్న అంటుంది. నాకు నీ ఒరిజినాలిటీ చూడాలని ఉందని సూరజ్ అంటాడు. జ్యోత్స్న కోపంగా అక్కడ నుంచి వెళ్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు జ్యోత్స్న, శివన్నారాయణ, కార్తీక్ ఆఫీస్ కీ వెళ్తుంటే సూరజ్ అటో కోసం చూస్తాడు. శివన్నారాయణ తనని చూసి కార్ ఎక్కమంటాడు. వద్దని జ్యోత్స్న అంటుంది. అయితే నువ్వే దిగి తనని సేఫ్ గా ఆఫీస్ కి ఎలా తీసుకొని వస్తావో.. రా తనతో పాటు రాకుండా ఉంటే రేపటి నుంచి నువ్వు ఆఫీస్ కీ రావద్దని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత సూరజ్ ఆటో ఆపుతాడు. నేను ఆటోలో రానని జ్యోత్స్న అంటుంది. రాకు అని సూరజ్ అనగానే.. ఇప్పుడు వీడితో ఆఫీస్ కి వెళ్లకుంటే తాత కోప్పడతాడని తప్పక సూరజ్ తో పాటు షేరింగ్ ఆటోలో వస్తుంది జ్యోత్స్న.
ఆ తర్వాత దీప, కార్తీక్ వాళ్ళు ఆఫీస్ ముందు ఉంటారు. అప్పుడే సూరజ్,జ్యోత్స్న వస్తారు. నువ్వు ఇక్కడ ఏం చెస్తున్నావ్ బావ అని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు సూరజ్ కి హెల్ప్ చేస్తున్నావ్ కదా.. నేను దీపకి హెల్ప్ చేస్తున్నానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్నకి ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. ఒక ప్లేట్ కి మూడు వేలు అని జ్యోత్స్న అంటుంది. లేదు రెండువేలకి ఇవ్వండి అని అతను అనగానే మీరు వెళ్ళండి అని జ్యోత్స్న అంటుంది. అతను వెళ్తుంటే మీరు అన్న రేట్ కి నేను ఇస్తానని అతన్ని దీప పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |